విశాఖ నగర సర్దార్... బ్లాక్ షో

విశాఖ నగర సర్దార్... బ్లాక్ షో 
విశాఖ నగర సర్దార్... బ్లాక్ షో !


  • కీలక నేత కుటుంబానికి కలెక్షన్ల పండుగ
  • థియేటర్లు యజమానులవి.. టికెట్లు వీరివి
  • అడ్డంగా రేట్లు పెంచేసి అమ్మకాలు
  • తొలి మూడు రోజుల్లో రూ. 50 కోట్ల దోపిడీకి స్కెచ్
అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే...ఫ్యాన్స్ కు పండగే పండుగ. తొలి షోనే చూడాలి. కుదరకపోతే కనీసం తొలిరోజే ఏదో ఓ షో చూడాల్సిందే. .. ఈల వేసి... గోల చేసి.. కేవ్వు కేక పుట్టించాల్సిందే. ఇదీ అభిమానుల ఆరాటం.. కోలాహలం.. సరిగ్గా ఈ ఆరాటాన్నే నగరంలోని కీలక నేత కుటుంబం అడ్డంగా వాడేసుకుంటోంది. అభిమానాన్ని సొమ్ము చేసుకునేందుకు అక్రమ కలెక్షన్ల షోకు తెగించింది. ఇసుక, మద్యం మాఫియాలను మించిపోయేలా... క్రికెట్ బెట్టింగులనూ తలదన్నేలా... జిల్లాలో సరికొత్త సినీ వ్యాపారానికి తెరతీసింది. గతంలో బాహుబలి సినిమాతో ప్రారంభించిన ఆ దందాను సర్దార్ గబ్బర్ సింగ్ తో రెట్టింపు చేసింది. వెండితెర సాక్షిగా తొలి మూడు రోజుల్లో నగరంలో రూ. 33.75 కోట్లు... గ్రామీణ జిల్లాలో రూ. 15 కోట్లు వసూళ్ల దందాకు తెరతీసింది.

Share this

Related Posts

Previous
Next Post »