రెచ్చిపోయిన పవన్ అభిమానులు

రెచ్చిపోయిన పవన్ అభిమానులు

రెచ్చిపోయిన పవన్ అభిమానులు
హైదరాబాద్ : అభిమాన హీరో సినిమాను తొలిరోజే చూసేందుకు వీరాభిమానులు పాట్లు పడుతుంటారు. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టికెట్ల విషయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని చేయి విరిగింది. మరికొందరు గాయపడ్డారు.  ఈ సంఘటన శుక్రవారం ఉదయం వనస్థలిపురం విష్ణు థియేటర్ వద్ద  చోటుచేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
థియేటర్ గేట్లు తెరవకపోవడంతో ఒక్కసారిగా జనాలు తోసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పరమేశ్వరి థియేటర్ పై ప్రేక్షకులు దాడి చేశారు. సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు.

మరోవైపు  నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో పవన్ కల్యాణ్ అభిమానులు హల్ చల్ చేశారు. స్థానిక థియేటర్ లో సాంకేతిక లోపం ఏర్పడటంతో సినిమా ప్రదర్శనకు అంతరాయం ఏర్పడింది. దీంతో రెచ్చిపోయిన పవన్ అభిమానులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
అలాగే పవన్‌కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని మొదటి రోజు తొలి ఆట చూడటానికి వచ్చిన ఓ అభిమానికి టికెట్ దొరక్కపోవడంతో.. ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో చోటుచేసుకుంది. స్థానిక శ్రీనివాస టాకీస్ ఎదుట ఓ యువకుడు టికెట్ దొరకలేదని మనస్తాపానికి గురై వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని అడ్డుకున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ గబ్బర్ సింగ్ ...థియేటర్ వద్ద సందడి చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద హడావుడి చేస్తూ, పటాసులు కాల్చి, రంగులు చల్లుకుంటూ, పవన్ కటౌట్లకు క్షీరాభిషేకం చేశారు.

Share this

Related Posts

Previous
Next Post »