From the makers of Jabardast and Extra Jabardast, ETV Plus brings you Pataas! A new show where stand-up comedy meets reality TV!! Stay tuned for exciting things coming your way!
Sarainodu Trailer - Allu Arjun
VIDEOS
Sarainodu Trailer - Allu Arjun
CLICK HERE TO WATCH
రెచ్చిపోయిన పవన్ అభిమానులు
LATEST NEWSరెచ్చిపోయిన పవన్ అభిమానులు
హైదరాబాద్ : అభిమాన హీరో సినిమాను తొలిరోజే చూసేందుకు వీరాభిమానులు పాట్లు పడుతుంటారు. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టికెట్ల విషయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని చేయి విరిగింది. మరికొందరు గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వనస్థలిపురం విష్ణు థియేటర్ వద్ద చోటుచేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
థియేటర్ గేట్లు తెరవకపోవడంతో ఒక్కసారిగా జనాలు తోసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పరమేశ్వరి థియేటర్ పై ప్రేక్షకులు దాడి చేశారు. సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు.
మరోవైపు నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో పవన్ కల్యాణ్ అభిమానులు హల్ చల్ చేశారు. స్థానిక థియేటర్ లో సాంకేతిక లోపం ఏర్పడటంతో సినిమా ప్రదర్శనకు అంతరాయం ఏర్పడింది. దీంతో రెచ్చిపోయిన పవన్ అభిమానులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
మరోవైపు నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో పవన్ కల్యాణ్ అభిమానులు హల్ చల్ చేశారు. స్థానిక థియేటర్ లో సాంకేతిక లోపం ఏర్పడటంతో సినిమా ప్రదర్శనకు అంతరాయం ఏర్పడింది. దీంతో రెచ్చిపోయిన పవన్ అభిమానులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
అలాగే పవన్‌కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని మొదటి రోజు తొలి ఆట చూడటానికి వచ్చిన ఓ అభిమానికి టికెట్ దొరక్కపోవడంతో.. ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో చోటుచేసుకుంది. స్థానిక శ్రీనివాస టాకీస్ ఎదుట ఓ యువకుడు టికెట్ దొరకలేదని మనస్తాపానికి గురై వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని అడ్డుకున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ గబ్బర్ సింగ్ ...థియేటర్ వద్ద సందడి చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద హడావుడి చేస్తూ, పటాసులు కాల్చి, రంగులు చల్లుకుంటూ, పవన్ కటౌట్లకు క్షీరాభిషేకం చేశారు.
కాగా తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ గబ్బర్ సింగ్ ...థియేటర్ వద్ద సందడి చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద హడావుడి చేస్తూ, పటాసులు కాల్చి, రంగులు చల్లుకుంటూ, పవన్ కటౌట్లకు క్షీరాభిషేకం చేశారు.
'సర్థార్ గబ్బర్ సింగ్' మూవీ రివ్యూ
MOVIE TALK'సర్థార్ గబ్బర్ సింగ్' మూవీ రివ్యూ
టైటిల్ : సర్దార్ గబ్బర్ సింగ్
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, శరద్ కేల్కర్, ముఖేష్ రుషి, అలీ
దర్శకత్వం : కే యస్ రవీంద్ర (బాబీ)
నిర్మాత : శరత్ మరార్
దాదాపు మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో హీరోగా తెరకెక్కిన సినిమా సర్దార్ Aగబ్బర్ సింగ్. పవన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమాలోని క్యారెక్టరైజేషన్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం, పూర్తిగా కొత్త కథా కథనాలను ఎంపిక చేసుకున్నారు. గబ్బర్ సింగ్ సక్సెస్ తో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు లాంగ్ గ్యాప్ తరువాత పవన్ సోలో హీరోగా తెరకెక్కిన సినిమా కావటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను సర్దార్ గబ్బర్ సింగ్ అందుకుందా..? పవన్ ముందున్న రికార్డ్ లు సర్దార్ బుల్లెట్ల దెబ్బకు బద్దలయ్యాయా..?
కథ :
రతన్ పూర్ తెలుగు రాష్ట్ర సరిహద్దులోని ప్రాంతం. ఇప్పటికీ రాజరికపు వ్యవస్థ పాలనలో ఉన్న ఈ ప్రాంతంలో ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, ఆ రాజవంశీకుల కనుసన్నల్లోనే నడుస్తుంటారు. రాజుగారు చనిపొవటవంతో రాజవంశానికి చెందిన మూడు కుటుంబాలు అధికారం, ఆస్తుల కోసం పోటీపడతాయి. దుర్మార్గుడైన భైరవ్(శరద్ కేల్కర్) తన బలం, బలగంతో ఊరి ప్రజలను బయపెట్టి వ్యాపారం చేస్తుంటాడు. కానీ రాజుగారి వారసురాలు ఆర్శి దేవి( కాజల్ అగర్వాల్) ఉన్న ఆస్తులను అమ్మి తన తండ్రి ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంటుంది. రాజవంశానికి దళపతి అయిన హరినారాయణ (ముఖేష్ రుషి) ఆమెకు సాయంగా భైరవ్ నుంచి ఇబ్బందులు ఎదురు కాకుండా కాపాడుతుంటాడు.
రాజకుంటుంబాన్ని, ఆ ఊరి ప్రజలను భైరవ్ భారీ నుంచి కాపాడే సరైన వ్యక్తి కోసం హరినారాయణ ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో అతడి స్నేహితుడైన పోలీస్ అధికారి, రతన్ పూర్ కు సిఐగా కండబలం, బుద్ధిబలం ఉన్న సర్దార్ గబ్బర్ సింగ్(పవన్ కళ్యాణ్)ను పంపిస్తాడు. అనాథగా పెరిగిన సర్దార్, అతని స్నేహితుడు సాంబా ఓ పోలీస్ అధికారి సాయంతో డిపార్ట్ మెంట్ లో చేరతారు. ఎవరి మాట వినకుండా మొండిగా వ్యవహరించే సర్దార్, రతన్ పూర్ లో అడుగుపెట్టిన తరువాత తొలిసారిగా భైరవ్ కు ఎదురు నిలబడే వాడు ఒకడు వచ్చాడన్న ధైర్యం, ఆ ఊరి జనంలో కనిపిస్తుంది.
అదే సమయంలో రాజకుమారిని ఆ ఇంటి పనిమనిషిగా భావించిన ప్రేమలో పడతాడు సర్దార్. అదే రాకుమారిని తన సొంతం చేసుకొని రాజవంశానికి చెందిన మొత్తం ఆస్తిని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు భైరవ్. అలా డ్యూటీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా భైరవ్, సర్దార్ ల మధ్య యుద్ధం మొదలవుతుంది. మరి ఈ యుద్ధంలో ఎవరు ఎలా దెబ్బకొట్టారు. చివరకు భైరవ్ సామ్రాజ్యాన్ని సర్దార్ ఎలా కూల్చేశాడు అన్నదే మిగతా కథ.
నటీనటులు :
గబ్బర్ సింగ్ పాత్రతో తెలుగు సినిమాకు కిక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి అదే పాత్రలో ఆకట్టుకున్నాడు. కామెడీ యాక్షన్, ఎమోషన్ లను అద్భుతంగా పలికించి సినిమా అంతా వన్ మేన్ షోలా నడిపించాడు. యువరాణి పాత్రలో కాజల్ ఆకట్టుకుంది. మగథీర సినిమాలో మిత్రవింద తరహాలోనే సాగిన పాత్ర, పెద్దగా కొత్తగా కనిపించకపోయినా, తొలిసారిగా పవన్ సరసన నటించి మెప్పించింది. విలన్ పాత్రలో తెలుగు తెరకు పరిచయం అయిన శరద్ కేల్కర్ ఫరవాలేదనిపించాడు. నటన పరంగా ఓకె అనిపించిన శరద్, లుక్ విషయంలో మాత్రం మెప్పించాడు. రాక్షసుడైన రాజుగా సరిగ్గా సరిపోయాడు. ముఖేష్ రుషి, రావు రమేష్, అలీ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి ఇలా భారీ తారాగణం ఉన్న ఈ సినిమాలో ఎవరికి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణులు :
తెర మీదే కాదు తెర వెనక కూడా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ దే కీలక పాత్ర. కథా కథనాలను అందించటంతో పాటు అంతా తానే అయి సినిమాను ముందుకు నడిపించాడు పవన్. అయితే కథా పరంగా మెప్పించినా, కథనం పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ సాగదీసినట్టుగా అనిపించింది. దర్శకుడిగా బాబీ ఆకట్టుకున్నాడు.
మాస్ యాక్షన్ సినిమాకు తను మంచి ఛాయిస్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సాయిమాధవ్ బుర్రా మాటలు బాగున్నాయి. చాలా సందర్భాల్లో పవన్ వ్యక్తిత్వాన్ని డైలాగ్స్ లో వినిపించే ప్రయత్నం చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. అయితే క్లైమాక్స్ ఫైట్ లో మితిమీరిన తూపాకుల మోత కాస్త ఇబ్బంది పెడుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ పాటలతో పాటు నేపథ్య సంగీతంలోనూ తన మార్క్ చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Subscribe to:
Posts (Atom)